: మహేష్ బాబు చిత్రం కోసం వేసిన సెట్లో అగ్నిప్రమాదం


ప్రిన్స్ మహేష్ బాబు, మురుగదాస్ ల కాంబినేషన్ లో రూపుదిద్దుకుంటున్న చిత్రం కోసం వేసిన సెట్లో ఈ ఉదయం అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ ఫిలింనగర్ లోని దేవయ్యకుంట ప్రాంతంలో వేసిన సెట్లో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఉదయం ఎవరో కాల్చిన టపాకాయల నిప్పురవ్వలు వచ్చి పడటంతో లొకేషన్ లోని సెట్ పూర్తిగా కాలిపోగా, టెంట్లు, ఇతర సామాగ్రికి కూడా నిప్పంటుకుంది. ఇటీవల ఈ సెట్లో కొంత భాగం షూటింగ్ నిర్వహించారు. ఇదిలా ఉంచితే, ఈ రోజు ఈ చిత్రం షూటింగ్ వేరే లొకేషన్లో జరుగుతున్నట్టు సమాచారం.

  • Loading...

More Telugu News