: జైళ్ల నుంచి ప్రతిసారి ముస్లింలే ఎందుకు పారిపోతారు?: దిగ్విజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు


భోపాల్ సెంట్రల్ జైల్ నుంచి పరారైన సిమీ ఉగ్రవాదులను ఎన్ కౌంటర్ చేయడంపై కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేవలం ముస్లింలు మాత్రమే జైళ్ల నుంచి ఎందుకు పారిపోతారని... హిందువులు ఎందుకు పారిపోరని ఆయన పశ్నించారు. ఈ మొత్తం వ్యవహారంపై ఎన్ఐఏ చేత విచారణ జరిపించాలని, ఆ విచారణను కోర్టు పర్యవేక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. ముస్లింలు మాత్రమే జైళ్ల నుంచి పరారవుతున్న విషయంపై కూడా దర్యాప్తు జరగాలని కోరారు. మరోవైపు దిగ్విజయ్ వ్యాఖ్యలను మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తప్పుబట్టారు. మన దేశంలో ఏ ఎన్ కౌంటర్ లో అయినా ఉగ్రవాదులు మరణించగానే... దాన్ని రచ్చ చేయడానికి కొంత మంది నేతలు సిద్ధంగా ఉంటారని, వారిలో కాంగ్రెస్ నేతలు అందరికన్నా ముందుంటారని విమర్శించారు.

  • Loading...

More Telugu News