: విలన్ గా అవకాశం ఇవ్వండి... నేనేంటో చూపిస్తా అంటున్న హీరో
రెండేళ్ల విరామం తర్వాత హీరో సుమంత్ ఓ డిఫరెంట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన 'విక్కీ డోనర్' సినిమాను తెలుగులో 'నరుడా డోనరుడా' పేరుతో రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాతో మళ్లీ సక్సెస్ ట్రాక్ లోకి రావాలని సుమంత్ భావిస్తున్నారు. ఈ చిత్రంతో నటుడిగా తనను తాను ప్రూవ్ చేసుకోవాలని అభిలషిస్తున్నాడు. అంతేకాదు, అవకాశం వస్తే, విలన్ పాత్రల్లో కూడా నటించడానికి తాను సిద్ధమని ప్రకటించాడు. రామాయణంలో రావణుడు, మహాభారతంలో దుర్యోధనుడు లాంటి పాత్రలు తనకు ఎంతో ఇష్టమని... అలాంటి పాత్రల కోసం వెయిట్ చేస్తున్నానని చెప్పాడు.