: పాకిస్థాన్ లో దీపావళి వేడుకలు జరుపుకున్న బాలీవుడ్ నటి


ఉరీ ఉగ్రవాద ఘటనతో ఓవైపు భారత్-పాక్ ల మధ్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. మరోవైపు, పాక్ నటీనటులు బాలీవుడ్ లో నటించకుండా అనధికారికంగా నిషేధం విధించారు. ఈ నేపథ్యంలో, ప్రముఖ బాలీవుడ్ నటి, దర్శకనిర్మాత పూజాభట్ పాక్ లో పర్యటించింది. అంతేకాదు, దీపావళి పండుగను కరాచీలో సెలబ్రేట్ చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే, పాక్ గాయకుడు అలీ అజమాత్ ఆహ్వానం మేరకు ఆమె పాక్ వెళ్లారు. భారత్ తిరిగివచ్చిన తర్వాత ఆమె మాట్లాడుతూ, కరాచీకి వెళ్లిరావడం తనకు ఎంతో సంతోషాన్ని కలిగించిందని చెప్పింది. బాలీవుడ్ ప్రముఖులు పాకిస్థాన్ కు వెళ్లి రావడం చాలా సాధారణ విషయమే. పూజాభట్ కూడా గతంలో ఎన్నోసార్లు పాక్ వెళ్లి వచ్చింది. అయితే, తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఆమె పాకిస్థాన్ కు వెళ్లడం... బాలీవుడ్ లో కూడా చర్చనీయాంశంగా మారింది.

  • Loading...

More Telugu News