: మళ్లీ రెచ్చిపోయిన పాక్ రేంజర్లు.. జమ్ముకశ్మీర్‌లో కొనసాగుతున్న ఎన్‌కౌంటర్
నియంత్రణ రేఖ వెంబడి పాక్ బలగాలు మరోమారు రెచ్చిపోయాయి. ఎల్‌వోసీ వెంబడి రోజూ కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న పాక్ తాజాగా సాంబా, నౌషేరా, సెక్టార్లలో కాల్పులకు తెగబడింది. స్పందించిన భారత బలగాలు దీటుగా జవాబిస్తున్నాయి. మరోవైపు జమ్ముకశ్మీర్‌లోని బందిపొరా జిల్లా అజార్‌లో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య ఎన్‌కౌంటర్ కొనసాగుతోంది. ఇరు వర్గాల మధ్య భీకరంగా కాల్పులు జరుగుతున్నాయి. చుట్టుపక్కల ప్రాంతాల్లోని పౌరులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఉగ్రవాదులను చుట్టుముట్టిన సైన్యం కాల్పులతో విరుచుకుపడుతోంది.