: దీపావళికి ‘మెగా’ హీరోల ఫొటో పోజ్ ఇదీ!


దీపావళికి ‘మెగా’ హీరోల ఫొటో పోజ్ అదిరిపోయింది. నిన్న దీపావళి పండగ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి సహా ఆ కుటుంబంలోని హీరోలు కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఫొటోకు మాంచి పోజొకటి ఇచ్చారు. మెగాస్టార్ కు అటు ఇటు సాయిధరమ్ తేజ్, వరుణ్ తేజ్ కూర్చున్నారు. వరుణ్ తేజ్ పక్కన బన్నీ, సాయిధరమ్ తేజ్ పక్కన నాగేంద్రబాబు, ఆయన కూతురు నీహారిక నవ్వులు చిందిస్తూ కూర్చున్నారు. బన్నీ వెనుక అల్లు శిరీష్, వరుణ్ తేజ్ భుజంపై చేయి వేసి రామ్ చరణ్ నిలబడి ఉన్నారు. ఈ ఫొటోను మెగాస్టార్ 150వ చిత్రం ‘ఖైదీ నంబర్ 150’ ట్విట్టర్ ఖాతా ద్వారా రామ్ చరణ్ ‘మెగా’ అభిమానులతో పంచుకున్నాడు. ‘అన్నయ్య కుటుంబం ‘మెగా కింగ్ డమ్’ మెగా వారసులు.. మెగా ఫ్యామిలీ’ అంటూ ఆ ట్వీట్ లో రామ్ చరణ్ పేర్కొన్నాడు. కాగా, ఒక షూటింగ్ లో గాయపడ్డ వరుణ్ తేజ్ ప్రస్తుతం ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్నాడు.

  • Loading...

More Telugu News