: నేటి నుంచి నిర్ణయించిన తేదీల్లో ఐదుగంటల పాటు ముంబయి విమానాశ్రయం మూసివేత


మరమ్మతు పనుల కారణంగా రోజూ ఐదుగంటల పాటు ముంబయిలోని ఛత్రపతి శివాజీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు (సీఎస్ఐఏ) ను మూసివేయనున్నారు. నేటి నుంచి వచ్చే నెల 28వ తేదీ వరకు నిర్ణయించిన తేదీల్లో ఈ మూసివేత కార్యక్రమం కొనసాగుతుంది. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విమానాశ్రయాన్ని మూసివేయనున్నట్లు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. నవంబర్ 3, 7, 10, 14, 17, 21, 24, 28 తేదీల్లో మాత్రమే సూచించిన సమయాల్లో మూసివేయడం జరుగుతుందన్నారు. కాగా, 200 విమాన సర్వీసులు కన్నా ఎక్కువగానే ఆయా తేదీల్లో రద్దయ్యే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.

  • Loading...

More Telugu News