: జీజీహెచ్ లో సమ్మె విరమణ.. ఉదయం గంటపాటు నిరసన తెలుపుతామన్న జూనియర్ డాక్టర్లు


గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి (జీజీహెచ్)లో జూనియర్ డాక్టర్లు సమ్మె విరమించారు. రేపటి నుంచి విధులకు హాజరుకానున్నారు. ఈ విషయాన్ని జూనియర్ డాక్టర్లు పేర్కొన్నారు. ప్రొఫెసర్ లక్ష్మిని అరెస్ట్ చేసే వరకు ప్రతిరోజూ ఉదయం గంటపాటు నిరసన తెలుపుతామని జూడాలు పేర్కొన్నారు. మంత్రి కామినేని హామీ మేరకు తాము సమ్మె విరమిస్తున్నామన్నారు. కాగా, జీజీహెచ్ లో యువ వైద్యురాలు సంధ్యారాణి ఆత్మహత్య కేసులో గైనకాలజీ విభాగం ప్రొఫెసర్ డాక్టరు లక్ష్మి ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో లక్ష్మిపై చర్యలు తీసుకోవాలంటూ జూడాల సంఘం నాయకులు విధులను బహిష్కరించారు. సంధ్యారాణి ఆత్మహత్య చేసుకునేంతగా వేధించిన ప్రొఫెసర్ లక్ష్మిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు, చట్టపరంగా అరెస్టు చేయాలని వైద్య విద్యార్థులు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News