: హైకోర్టును ఆశ్రయించిన మావోయిస్టు నేత ఆర్కే భార్య శిరీష
ఏవోబీలో జరిగిన ఎన్‌కౌంటర్ తరువాత తన భర్తను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని, ఆయనను న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టేలా ఆదేశాలు జారీ చేయాలని డిమాండ్ చేస్తూ ఆర్కే భార్య శిరీష ఈ రోజు హైకోర్టును ఆశ్రయించారు. అత్యవసర వ్యాజ్యంగా తన పిటిషన్‌ను విచారణకు స్వీకరించాలని ఆమె కోర్టును కోరారు. ఆమె పిటిషన్‌ను ఈ రోజు మధ్యాహ్నం 2.30 గంటలకు న్యాయస్థానం పరిశీలించనుంది.