: కుప్వారాలో రెండో రోజు కొనసాగుతున్న ఎదురుకాల్పులు
జమ్ముకశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలోకి ప్రవేశించిన ఉగ్రవాదులను హతమార్చడానికి భద్రతా బలగాలు ఎదురుకాల్పులు జరుపుతున్నాయి. నిన్న ఆ ప్రాంతంలోకి ఉగ్రవాదులు చొరబడ్డారని తెలుసుకున్న భారత సైన్యం నిన్నటి నుంచి కాల్పులు జరుపుతూనే ఉంది. మరోవైపు ఎల్వోసీ వద్ద పాక్ రేంజర్లు కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉన్నారు. భారత సైన్యం వారి కాల్పులకు దీటుగా సమాధానం చెబుతోంది. బాలాకోటే, ఆర్ఎస్ పురా, మెంధర్ సెక్టార్లో పాక్ రేంజర్లు కాల్పులకు పాల్పడుతూ కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తున్నారు.