: 2019 వరల్డ్ కప్ వరకు ధోనీ కొనసాగాలని కోరుకుంటున్న మాజీలు


వచ్చే ఏడాది జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత టీమిండియా వన్డే, టీ20 కెప్టెన్ ఎంఎస్ ధోనీ అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలుకుతాడనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. వచ్చే ఏడాది జూన్ లో ఈ ట్రోఫీ జరగనుంది. మరోవైపు, 2019 వరల్డ్ కప్ వరకు ధోనీ కొనసాగాలని మాజీ క్రికెటర్లు కోరుకుంటున్నారు. కపిల్ దేవ్, సునీల్ గవాస్కర్, సచిన్ టెండూల్కర్ లా ధోనీ కూడా గొప్ప ఆటగాడని మాజీ కెప్టెన్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. ధోనీలాంటి ఆటగాడు సమీప భవిష్యత్తులో దొరకడం చాలా కష్టమని... 2019 వరకు అతను కొనసాగాలని అభిలషించాడు. తనదైన శైలితో క్రికెట్ పై ధోనీ చెరగని ముద్రను వేశాడని చెప్పాడు. మాజీ వికెట్ కీపర్ కిరణ్ మోరే మాట్లాడుతూ, ఫిట్ గా ఉంటే 2019 వరల్డ్ కప్ వరకు ధోనీ కొనసాగుతాడని అన్నాడు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి ఇప్పటికిప్పుడు ధోనీ తప్పుకోవాల్సిన అవసరం కనబడటం లేదని ఆశిష్ నెహ్రా తెలిపాడు.

  • Loading...

More Telugu News