: భోపాల్ జైలు నుంచి పరారైన కరుడుగట్టిన ఉగ్రవాదులు వీరే


దేశమంతా దీపావళి జరుపుకుంటున్న వేళ, భోపాల్ కేంద్ర కారాగారం నుంచి తప్పించుకున్న 8 మంది కరుడుగట్టిన ఉగ్రవాదుల వివరాలను పోలీసు వర్గాలు వెల్లడించాయి. ఈ 8 మంది కోసం గాలిస్తున్నామని తెలిపాయి. అహ్మదాబాద్ కు చెందిన ముజీబ్ షేక్, మధ్యప్రదేశ్ కు చెందిన అబ్దుల్ మజీద్, షోలాపూర్ కు చెందిన మహ్మద్ ఖాలీద్ అహ్మద్, మహ్మద్ సాలిక్ అలియాస్ సల్లూ, అమ్జాద్, జకీర్ హుస్సేన్ సాదిక్, అకీల్, మహబూబ్ గుడ్డూలు తప్పించుకున్నారని మధ్యప్రదేశ్ ఐజీ యోగేష్ చౌదరి వివరించారు. వీరు చాలా కేసుల్లో నిందితులుగా ఉన్నారని, బ్యాంకు చోరీలు, హత్య కేసులు, బాంబులు పేల్చాలన్న కుట్రలు, దోపిడీల్లో వీరు నిందితులని తెలిపారు. పారిపోయిన ఉగ్రవాదుల ఫోటోలను విడుదల చేసిన ఆయన, వీరి ఆచూకీ తెలిపిన వారికి రూ. 5 లక్షలు రివార్డుగా ఇస్తామని ప్రకటించారు. కాగా, ఈ ఘటనను తీవ్రంగా తీసుకున్న మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఐదుగురు జైలు అధికారులను సస్పెండ్ చేయడంతో పాటు ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించింది. ఉగ్రవాదులను నిలువరించే క్రమంలో తన ప్రాణాలు కోల్పోయిన సెంట్రీ కుటుంబాన్ని ఆదుకుంటామని ప్రకటించింది.

  • Loading...

More Telugu News