: హీరోయిన్ రాశీ ఖన్నా దీపావళి సెలబ్రేషన్స్ ఇలా!
టాలీవుడ్ అందాల నటి రాశీ ఖన్నా, తన దీపావళి సెలబ్రేషన్స్ ను వినూత్నంగా జరుపుకుంది. నటి సమంత ఆధ్వర్యంలో నడుస్తున్న ప్రత్యూష ఫౌండేషన్ ప్రాణాంతక హెచ్ఐవీ, ఎయిడ్స్ బారిన పడిన చిన్నారుల నిమిత్తం ఓ సేవా సంస్థను నిర్వహిస్తుండగా, ఆదివారం నాడు రాశీ ఖన్నా అక్కడికి వెళ్లి సందడి చేసింది. పిల్లలతో కలసి దీపావళి టపాకాయలు కాల్చి తాను చిన్న పిల్లగా మారిపోయింది. వారికి మిఠాయిలు, శాండ్ విచ్ లను పంచింది. రాశీ ఖన్నా దీపావళి సెలబ్రేషన్స్ చిత్రాలను మీరూ చూడవచ్చు.