: వైజాగ్ చేరుకున్న సింగపూర్ యుద్ధనౌక
సింగపూర్ నేవీకి చెందిన యుద్ధనౌక విశాఖపట్నం చేరుకుంది. భారత్-సింగపూర్ దేశాలు సంయుక్తంగా నిర్వహించే సిమ్ బెక్స్-16 విన్యాసాల్లో పాల్గొనేందుకు ఈ నౌక నిన్న తరలి వచ్చింది. ఈ సందర్భంగా, సింగపూర్ నేవీకి చెందిన ఉన్నతాధికారి కల్నల్ ఆరోన్ బెంగ్ మన దేశ తూర్పు నావికాదళ కేంద్రమైన విశాఖను సందర్శిస్తారని రక్షణశాఖ ఓ ప్రకటనలో తెలిపింది.