: లక్ష్మీదేవికి ముఖేష్ అంబానీ అంటేనే ఎందుకో అంత ప్రేమ?: రాంగోపాల్ వర్మ


ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ అంటేనే వెరైటీ కామెంట్లు, విమర్శలు, వ్యంగ్యం అన్నీ కలిపి గుప్పిస్తాడని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పండగలు, పబ్బాలు, రాజకీయాలు, నేతలు, సినిమాలు, అవార్డులు, దేవతలు.. ఇలా ఏ అంశాన్నీ వదలకుండా తనదైన శైలిలో ట్వీట్ చేసే వర్మ, తాజాగా, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అధినేత, ప్రముఖ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీపై ట్వీట్ గుప్పించాడు. ‘అమ్మవారు లక్ష్మీదేవిని పూజించే వాళ్లు ఎంతో మంది ఉండగా, ముఖేష్ అంబానీనే ఆమె ఎక్కువగా ప్రేమిస్తుంది ఎందుకో? ప్రత్యేకంగా ఆయనేమైనా ప్రార్థిస్తారా? లేక బయటకు చెప్పటానికి వీలుకాని ‘డీల్’ ఏదైనా వారి మధ్య ఉందా?’ అంటూ సరదాగానో లేక వ్యంగ్యంగానో వర్మ తన ట్వీట్ లో ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News