: గొప్ప నటుడిగా ఎదగాలంటే మద్యం, సిగిరెట్ మానేయమని చెప్పారాయన!: రజనీకాంత్


గొప్ప నటుడిగా ఎదగాలంటే మద్యం, సిగిరెట్ మానేయమని మంచి సలహా ఇచ్చి తనలోని చెడు వ్యసనాలను బయటకు పంపించింది సీనియర్ నటుడు శివకుమార్ అని తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ అన్నారు. సీనియర్ నటుడు శివకుమార్ తన 75వ పుట్టినరోజు జరుపుకుంటున్న సందర్భంగా రజనీకాంత్ శుభాకాంక్షలు జరిపారు. దక్షిణాది నటులు, సోదరులు అయిన సూర్య, కార్తీల తండ్రి అయిన శివకుమార్ కు ఈ మేరకు ఆయన ఒక లేఖ రాశారు. "నా కెరీర్ తొలినాళ్లలో ఆయన నుంచి ఎన్నో జీవిత పాఠాలు నేర్చుకున్నాను. అప్పట్లో నాకు మద్యం, సిగిరెట్ తాగే అలవాటు ఉండేది. గొప్ప నటుడిగా ఎదగాలంటే ఈ అలవాట్లను పక్కనపెట్టాలని, ఆరోగ్యం నాశనం చేసుకోవద్దని ఆయన మంచి సలహా ఇచ్చారు. చెడు వ్యసనాలతో నా ఆరోగ్యాన్ని పాడు చేసుకున్నా. ఆయన ఇచ్చిన ఆరోగ్య సలహాలు పాటించిన తర్వాత శారీరకంగానే కాదు, మానసికంగానూ బలపడ్డా. మహోన్నత వ్యక్తిత్వం కలిగిన శివకుమార్ కు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆ దేవుడిని కోరుకుంటున్నాను" అని రజనీ ఆ లేఖలో పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News