: ఇస్లాం మత బోధకుడు జకీర్ నాయిక్ కి పితృవియోగం
వివాదాస్పద ఇస్లాం మత బోధకుడు జకీర్ నాయిక్ తండ్రి అబ్దుల్ కరీంనాయిక్ (87) గుండెపోటుతో మరణించారు. గత కొంత కాలంగా ఆయన హృద్రోగ సమస్యతో బాధపడుతున్నారు. ఈరోజు తెల్లవారు జామున ఆయనకు తీవ్రమైన గుండెపోటు రావడంతో మరణించారు. అబ్దుల్ వైద్యుడిగా, విద్యావేత్తగా తన సేవలను అందించారు.