: అరకిలో బియ్యం తెచ్చుకుని వండుకుని తినడం నుంచి మేమిద్దరం కలిసే ఉన్నాం: హాస్య నటుడు పృథ్వీ


అరకిలో బియ్యం వండుకుని తినడం దగ్గర నుంచి, రెండు వేల రూపాయల లంచ్ చేసే వరకు నటుడు తాగుబోతు రమేష్, తాను కలిసే ఉన్నామని హాస్య నటుడు పృథ్వి అన్నాడు. ఒక న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ‘తాగుబోతు రమేష్ కూడా ఇండస్ట్రీకి వచ్చి చాలా ఏళ్లు అయింది. మేమిద్దరం కలిసి చాలా రోజులు ఉన్నాం. ఇంతమంది కమెడియన్స్ ఉన్నా కూడా, తాగుబోతు రమేష్ వేరియషన్ వేరు. ఇంకా అతనితో ‘మందు’ డైలాగులే చెప్పిస్తున్నారు కానీ, అతన్ని సరిగ్గా ఇండస్ట్రీలో ఉపయోగించుకోవట్లేదు’ అన్నారు పృథ్వీ. ఈ సందర్భంగా దీపావళి పండగ గురించి మాట్లాడుతూ, తాను బిజీ కాకముందే పండగ బాగా జరుపుకునేవాడినని, చుట్టాలు, బంధువులు, అందరు కలుస్తుండేవారని, షూటింగ్ ఉన్నా కూడా మధ్యలో ఇంటికెళ్లి శుభ్రంగా భోజనం చేసి వెళ్లిపోయేవాడినని, ఈ బిజీ జీవితంలో అన్నీ మిస్సయిపోతున్నామని అన్నారు.

  • Loading...

More Telugu News