: 'పిజ్జా తిందాం', 'కాఫీ తాగేందుకు కలుద్దాం'... భారత గడ్డపై పాక్ గూఢచారుల కోడ్ లాంగ్వేజ్


'కాఫీ పీనా హై ఆజ్' (ఇవాళ కాఫీ తాగాలి) అంటే... నేడు మనం సమావేశం కావాలి అని. పిజ్జా తిందామనో బర్గర్ ఉందనో అంటే ఏదో సమాచారం ఇచ్చి పుచ్చుకోవాల్సి వుందని అర్థం. గత బుధవారం నాడు పాకిస్థాన్ కు సమాచారం అందిస్తున్నారన్న ఆరోపణలపై అరెస్ట్ చేసిన నలుగురిని విచారించిన పోలీసులు వారి కోడ్ లాంగ్వేజ్ గురించి తెలుసుకున్నారు. వీరు జనసమ్మర్ధం అధికంగా ఉండే అన్సాల్ ప్లాజా, పీతంపురా మాల్, ప్రీతి విహార్ మాల్ వంటి చోట్ల కలుసుకుని సాంకేతిక సమాచారాన్ని, డాక్యుమెంట్లనూ ఇచ్చి పుచ్చుకునే వారని విచారణ అధికారులు తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లోనే డబ్బులు ఇచ్చి పుచ్చుకునేవారని, అందరి ముందైతే ఎవరికీ అనుమానం రాదన్నదే వారి ఆలోచనని తెలిపారు. ఐఎస్ఐ ఏజంట్ మెహమూద్ అఖ్తర్, అతని భారత సహాయకుడు షోయబ్ లు ఈ కేసులో కీలకమని, వారి నుంచి మరింత సమాచారం రాబట్టాల్సి వుందని పోలీసు వర్గాలు వెల్లడించాయి. షోయబ్ ను పాకిస్థాన్ తీసుకెళ్లిన అఖ్తర్, అతని పర్యటన ఖర్చుల నిమిత్తం రూ. లక్ష వరకూ వెచ్చించాడని కూడా అధికారులు కనుగొన్నారు.

  • Loading...

More Telugu News