: ట్రంప్ కూ గెలిచే అవకాశాలున్నాయి... అలసత్వం వద్దని మద్దతుదారులను హెచ్చరించిన హిల్లరీ


వివిధ రకాల సర్వేలు తానే ఆధిక్యంలో ఉన్నట్టు చెబుతున్న వేళ, అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో డెమోక్రాట్ల అభ్యర్థిగా ఉన్న హిల్లరీ క్లింటన్ కీలక వ్యాఖ్యలు చేశారు. డొనాల్డ్ ట్రంప్ పై తనకు ఆధిక్యం కనిపిస్తున్నా, అలసత్వం పనికిరాదని తన మద్దతుదారులను ఆమె హెచ్చరించారు. ట్రంప్ కు కూడా ఇంకా గెలిచే అవకాశాలు ఉన్నాయని, మరో పది రోజుల పాటు ప్రజల్లోనే ఉండి ప్రచారం నిర్వహించాలని, ఏ క్షణాన్నీ వదిలి పెట్టరాదని ఆమె అన్నారు. కాగా, తాజాగా ఈ-మెయిల్ స్కాములో ఎఫ్బీఐ మరోసారి విచారణ మొదలు పెట్టడంతో అది హిల్లరీకి ఎదురు దెబ్బ అవుతుందేమోనని ఆమె ప్రచార కమిటీ ఆందోళన వ్యక్తం చేస్తోంది.

  • Loading...

More Telugu News