: ఐదుగురు డక్కౌట్ అయిన వేళ... న్యూజిలాండ్ కు ఇదే అత్యంత చెత్త రికార్డు!


విశాఖపట్నం వేదికగా భారత్ తో జరిగిన నిర్ణయాత్మక వన్డే పోరులో న్యూజిలాండ్ జట్టు, తన క్రికెట్ చరిత్రలో అత్యంత చెత్త రికార్డును నమోదు చేసింది. తొలి ఓవర్లో యాదవ్ బౌలింగ్ లో గుప్తిల్, ఆపై 16వ ఓవర్ లో అమిత్ మిశ్రా బౌలింగ్ లో వాట్లింగ్, 19వ ఓవర్ లో యాదవ్ బౌలింగ్ లో ఆండర్సన్, 20, 22వ ఓవర్లలో మిశ్రా బౌలింగ్ లో సౌథీ, సోధీలు డక్కౌట్ కావడంతో 190 పరుగుల ఘోర ఓటమితో న్యూజిలాండ్ నిలిచిన సంగతి తెలిసిందే. గతంలో న్యూజిలాండ్ జట్టు పాకిస్థాన్ చేతిలో 2000లో 24.4 ఓవర్లకు ఆలౌట్ అయ్యింది. ప్రస్తుతం టీమిండియా చేతిలో 23.1 ఓవర్లలోనే ఆ జట్టు ఆటగాళ్లంతా పెవీలియన్ దారి పట్టగా, ఇది అత్యంత పేలవ ప్రదర్శనగా నిలిచింది. ఈ మ్యాచ్ లో గెలుపుతో ధోనీ సేన వన్డే సిరీస్‌ను 3-2 తేడాతో గెలుచుకోగా, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, మ్యాన్ ఆఫ్ ది సిరీస్ లను అమిత్ మిశ్రా గెలుచుకున్నాడు.

  • Loading...

More Telugu News