: సరిహద్దుల్లో ఇరు దేశాల కాల్పులు... నాలుగు పాక్ పోస్టుల ధ్వంసం


వాస్తవాధీన రేఖ వెంబడి కేరన్ సెక్టారులో ఇండియా, పాకిస్థాన్ జవాన్ల మధ్య భారీ ఎత్తున ఎదురుకాల్పులు జరిగాయి. కనీసం 20 మందికి పైగా పాక్ జవాన్లు గాయపడి వుంటారని, నాలుగు పోస్టులను భారత సైన్యం ధ్వంసం చేసిందని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాక్ రేంజర్లు ఉల్లంఘించిన వేళ, భారత సైన్యం దీటుగా బదులిచ్చిందని తెలిపారు. భారత పోస్టులు లక్ష్యంగా పాక్ కాల్పులు ప్రారంభించడంతో, ఆత్మ రక్షణ నిమిత్తం సైన్యం ఎదురుకాల్పులకు దిగిందని వివరించారు. మచిల్ సెక్టారులో పాక్ జరిపిన కాల్పుల్లో ఓ బీఎస్ఎఫ్ జవాను మరణించగా, మరో ఇద్దరికి గాయాలు అయ్యాయి. కాగా, భారత్ సర్జికల్ దాడుల తరువాత జరిగిన వివిధ ఎదురు కాల్పుల ఘటనల్లో నలుగురు ఆర్మీ, ముగ్గురు బీఎస్ఎఫ్ జవాన్లు, నలుగురు పౌరులు మరణించారు. గత వారంలో ఒకేసారి 15 మంది పాకిస్థాన్ సైనికులు ఎదురుకాల్పుల్లో హతమైన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News