: టాటా గ్రూప్ కు రాజీనామా చేసిన మరో ముగ్గురు


టాటా సన్స్ సలహా సంఘంలో సభ్యులుగా ఉన్న ముగ్గురు సీనియర్ ఉద్యోగులు రాజీనామా చేశారు. వీరిని మాజీ చైర్మన్ సైరస్ మిస్త్రీ నియమించగా, ఆయన వెళ్లిపోయిన తరువాత, వీరిని రాజీనామా చేయాలని డైరెక్టర్ల బోర్డు కోరినట్టు తెలుస్తోంది. బిజినెస్ డెవలప్ మెంట్ ఆఫీసర్ గా ఉన్న మధు కన్నన్, స్ట్రాటజీ విభాగాధిపతి నిర్మాల్య కుమార్, చీఫ్ హ్యూమన్ రిసోర్స్ అధికారి ఎస్ఎస్ రాజన్ లు రాజీనామా చేశారు. ఇదే సమయంలో బ్రాండ్ కస్టోడియన్ గా ఉన్న ముకుంద్ రాజన్, టైటాన్ సీఓఓ హర్షా భట్ లకు వేరే విధులను అప్పగించారు. తాజా పరిణామాలతో టాటా సన్స్ లో నెలకొన్న సంక్షోభం మరింతగా పెరిగినట్లయింది.

  • Loading...

More Telugu News