: ఫైనల్ వన్డేలో విజృంభించిన టీమిండియా బౌలర్లు.. ఐదు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కివీస్
విశాఖపట్నంలో జరుగుతున్న భారత్, న్యూజిలాండ్ ఫైనల్ వన్డే మ్యాచ్‌లో టీమిండియా ఉంచిన 270 పరుగుల లక్ష్య ఛేదనలో న్యూజిలాండ్ జట్టు తడబడి, పీకల్లోతు కష్టాల్లో పడింది. టాప్ ఆర్డర్ ఘోరంగా విఫలం కాగా మిడిల్ ఆర్డర్ కూడా రాణించలేకపోతోంది. ఓపెనర్ గుప్తిల్ డకౌట్‌గా వెనుదిరిగిన సంగతి తెలిసిందే. ఆ తరువాత క్రీజులోకి వచ్చిన లాథమ్ 19, కానె విలియమ్సన్ 27, టైలర్ 19 పరుగులు చేసి వెనుతిరిగారు. ఆ తరువాత వచ్చిన వాట్లింగ్ పరుగుల ఖాతా తెరవకుండానే వెనుదిరిగాడు. టీమిండియా బౌలర్లు ఉమేష్, బుమ్రా, అక్షర్, చెరో వికెట్ తీశారు. కాగా మిశ్రా రెండు వికెట్లు తీశాడు. ప్రస్తుతం న్యూజిలాండ్ స్కోరు ఐదు వికెట్ల నష్టానికి 66 పరుగులుగా ఉంది.