: జుట్టు పట్టుకుని ఘోరంగా కుమ్మేసుకున్న ఇద్దరు అమ్మాయిలు
అమెరికాలోని ఫ్లోరిడాలో ఇద్దరు అమ్మాయిలు జుట్టుపట్టుకొని కొట్టుకున్నారు. అబ్బాయిల కన్నా మేమేం తక్కువ? అన్నట్లు పిడిగుద్దులు గుద్దుకున్నారు. వారిద్దరిలో ఓ యువతి రెచ్చిపోయి తన ప్రత్యర్థి యువతి జుట్టుపట్టుకొని ముఖం వాచిపోయేలా కొట్టింది. ఓ బహుళ అంతస్తుల భవనం ముందు ఈ పోరు జరిగింది. అక్కడ నిలబడి ఉన్న యువతి వద్దకు మరో అమ్మాయి పరిగెత్తుకుంటూ వచ్చి కొట్టింది. దీంతో తేరుకున్న మరో యువతి తనపై దాడి చేసిన అమ్మాయిని కొట్టడం మొదలుపెట్టి కొద్ది సేపటి వరకు వదలలేదు. ఎటూ పారిపోవడానికి వీలు లేకుండా ఓ చేతితో జుట్టుని పట్టుకొని మరో చేతితో పిడిగుద్దులు కురిపించింది. వారిలో ఒక అమ్మాయి నల్ల టీ షర్టు వేసుకొని ఉండగా, మరో అమ్మాయి ఎర్ర టీషర్టు వేసుకుంది. నల్ల టీషర్టు అమ్మాయి చేతిలో ఎర్ర టీ షర్ట్ వేసుకున్న అమ్మాయి ఎన్నో దెబ్బలు తింది. మధ్యలో ఒక వ్యక్తి వారిని ఆపడానికి వచ్చినా వారి భీకర పోరుని మాత్రం ఆపలేకపోయాడు.