: ఇండో అమెరికన్‌ రాజా కృష్ణమూర్తికే ఓటెయ్యండంటున్న అమెరికా అధ్యక్షుడు ఒబామా


అమెరికాలోని షికాగో శివారు ప్రాంతంలో ఉన్న‌ కాంగ్రెషనల్‌ డిస్ట్రిక్ట్‌కు జరిగే ఎన్నికల్లో నిల‌బ‌డ్డ ఇండో అమెరికన్‌కు ఆ దేశ అధ్య‌క్షుడు బ‌రాక్ ఒబామా మ‌ద్ద‌తు ప‌లికారు. పోటీకి దిగిన‌ రాజా కృష్ణమూర్తి త‌ర‌ఫున ఆయ‌న ప్ర‌చారం చేశారు. కృష్ణ‌మూర్తిని తన ఇండో-అమెరికన్‌ మిత్రుడు అంటూ ఓ వీడియో ప్రకటనలో ఒబామా ద‌ర్శ‌న‌మిస్తున్నారు. త‌న మిత్రుడికే ఓటువేసి ఎల‌క్ష‌న్స్‌లో ఆయ‌న‌ను గెలిపించాలని సందేశం ఇచ్చారు. ఈ వీడియో నిడివి 30 సెకన్లు ఉంది. అందులో కృష్ణమూర్తితో క‌లిసి ఒబామా భారతీయ వంటకాలు రుచిచూస్తున్న దృశ్యాలు ఉన్నాయి. గ‌తంలో కృష్ణమూర్తి ఒబామాకు సాయం చేశారు. ఒబామా సెనేట్‌కు ఎన్నికయ్యే సమయంలో ఆ దేశ‌ ఆర్థిక వ్యవస్థ గురించి కృష్ణ‌మూర్తి ఆయ‌న‌కు తెలియజెప్పారు.

  • Loading...

More Telugu News