: భారత్‌ ఎప్పటికీ దేనికీ తలవంచదు: రాజ్‌నాథ్‌సింగ్‌


భారత్‌ ఎప్పటికీ దేనికీ తలవంచబోదని హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ అన్నారు. దీపావళి సందర్భంగా భారత సైన్యం, పోలీసులకు ఆయన శుభాకాంక్షలు తెలుపుతూ.. దేశం అంతటా ఎంతో ఉత్సాహంగా పండుగ జ‌రుపుకుంటున్నారంటే అందుకు వారే కార‌ణ‌మ‌ని చెప్పారు. మరోవైపు భార‌త సైన్యానికి దీపావళి శుభాకాంక్ష‌లు తెలిపిన వెంక‌య్య‌నాయుడు మీడియాతో మాట్లాడుతూ... ఈ పండుగ‌ వెలుగుల పండుగ అని అన్నారు. దీపావ‌ళిని అధర్మంపై ధర్మం విజ‌యం సాధిస్తుంద‌ని గుర్తు చేసుకుంటూ నిర్వ‌హించుకుంటార‌ని అన్నారు. దేశం అభివృద్ధి దిశ‌గా దూసుకెళ్లేలా ఈ పండుగ ప్ర‌జ‌ల‌కి నూత‌నోత్సాహాన్ని, సంతోషాన్ని ఇవ్వాల‌ని తాను కోరుకుంటున్న‌ట్లు వెంకయ్య పేర్కొన్నారు. పాకిస్థాన్‌కు కాల్పుల విర‌మ‌ణ ఒప్పందాన్ని ఉల్లంఘించ‌డం ఒక‌ అలవాటుగా మారిందని అన్నారు. ఆ దేశం తీరు చివ‌ర‌కు ఆ దేశాన్నే ఇబ్బందుల‌కు గురిచేస్తోంద‌ని అన్నారు. భస్మాసురుడిలాంటి ఉగ్ర‌వాదాన్ని ప్రోత్సహిస్తే చివ‌ర‌కు త‌మ చ‌ర్య‌కు తామే నాశనం అయిపోతార‌ని పేర్కొన్నారు. ఆ దేశంలో ఇప్పుడు ఇదే ప‌రిస్థితి కొన‌సాగుతోంద‌ని చెప్పారు. పాక్ ఇక‌నైనా ఆ చ‌ర్య‌లను మానుకోవాల‌ని అన్నారు.

  • Loading...

More Telugu News