: ఔరంగాబాద్ లో భారీ అగ్నిప్రమాదం.. 200 బాణసంచా దుకాణాలు అగ్నికి ఆహుతి.. దగ్ధమైన కార్లు


ఔరంగాబాద్‌లోని బాణసంచా దుకాణాల మార్కెట్‌లో ఈ రోజు మ‌ధ్యాహ్నం భారీ అగ్నిప్ర‌మాదం సంభ‌వించింది. మంటలు అంటుకుని మార్కెట్ అంత‌టా వ్యాపించ‌డంతో సుమారు 200 బాణసంచా దుకాణాలు ద‌గ్ధ‌మ‌య్యాయి. అంతేకాక‌, మంటలు ఎగసిప‌డి చుట్టుపక్కల ప్రాంతాలకు వ్యాపించడంతో కొన్ని కార్లు కూడా నాశ‌న‌మ‌య్యాయి. స‌మాచారం అందుకున్న అగ్నిమాప‌క సిబ్బంది ఫైరింజ‌న్ల‌తో అక్క‌డ‌కు చేరుకుని మంటలను ఆర్పుతున్నారు. ప్ర‌మాదం కార‌ణంగా భారీగా ఆస్తినష్టం వాటిల్లి ఉంటుంద‌ని స్థానికులు భావిస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి స‌మాచారం అందాల్సి ఉంది.

  • Loading...

More Telugu News