: సంతకం పెట్టగలిగే జయలలితకు ఏమైంది?... వేలిముద్ర ఎందుకు వేయాల్సి వచ్చింది?
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత చేతికి ఏమైంది? అన్న అనుమానాలు అక్కడి ప్రజల్లో నెలకొన్నాయి. తమిళనాడులోని మధుర జిల్లా తిరుపారంగుండ్రం అసెంబ్లీ స్థానానికి నవంబర్ 9న ఉపఎన్నిక జరగనుంది. అధికార ఏఐడీఎంకే తరఫున ఏకే బోస్ అనే అభ్యర్థి పోటీ చేయనున్నారు. అయితే ఆమేరకు సంబంధిత పత్రాలపై పార్టీ అధినేత్రి, సీఎం జయలలిత సంతకం తప్పనిసరి కావడంతో వైద్యులు ఆమె వేలిముద్రలు తీసుకున్నారు. ఇదే చర్చనీయాంశమైంది. ట్రెకియోటెమి విధానంలో జయలలిత కుడిచేతి గుండా కృత్రిమ నాళాలను వేసినందువల్లే ఆమె సంతకం చేయలేకపోయారని, అందుకే ఎడమచేతి వేలిముద్రలు తీసుకున్నామని అధికారులు ఎలక్షన్ కమిషన్ కు తెలిపారు. ఈ సందర్భంగా వారు దాఖలు చేసినపత్రాల్లో వేలిముద్రలు జయలలితవేనని మద్రాస్ మెడికల్ కాలేజీ నిపుణులు నిర్ధారించారు. దీంతో ఏకే బోస్ నామినేషన్ పత్రాలను ఈసీ స్వీకరించింది. ఈ ఘటనతో జయలలిత దీపావళి లోపు డిశ్చార్జి అయ్యే అవకాశాలు కనిపించడం లేదు. కాగా, గతంలో ఆమె దీపావళి నాటికి డిశ్చార్జ్ అవుతారని వార్తలు వెలువడిన సంగతి తెలిసిందే. దీంతో ఆమె మరికొన్ని రోజులు ఆసుపత్రిలోనే ఉండనున్నట్టు తెలుస్తోంది.