: చెత్త వాహనాల నుంచి కూడా ఆదాయాన్ని పొందనున్న జీహెచ్ఎంసీ
ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న జీహెచ్ఎంసీ... కొత్త ఆదాయ వనరుల కోసం అన్వేషిస్తోంది. ఈ క్రమంలో, హైదరాబాదులోని చెత్తను తరలించే వాహనాల ద్వారా ఆదాయం పొందాలని యత్నిస్తోంది. చెత్తను తరలించే వాహనాలపై ప్రకటనలకు అవకాశం కల్పించడం ద్వారా అదనపు ఆదాయం పొందాలని నిర్ణయించారు. నగరంలోని డంపింగ్ యార్డుల నుంచి జవహర్ నగర్ కు చెత్తను తరలించే 311 వాహనాలపై వాణిజ్య ప్రకటనలకు అవకాశం కల్పించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో, జీహెచ్ఎంసీ ఇచ్చిన టెండర్ నోటిఫికేషన్ కు... ఏడాది కాలానికి రూ. 39.43 లక్షలు ఇస్తామని ఓ యాడ్ ఏజెన్సీ బిడ్ వేసింది. దీంతో, ప్రతి యేటా వాహనాలకు రంగు, బ్రాండింగ్ చేయాల్సిన ఖర్చు మిగులుతుందని జీహెచ్ఎంసీ అధికారులు చెబుతున్నారు.