: పుట్టిన రోజు వేడుకలో ఘోరం... హైటెన్షన్‌ విద్యుత్ తీగలు తగిలి కాలిబూడిదైన ఐదుగురు వెయిటర్లు


రాజస్థాన్‌ లో దారుణం చోటుచేసుకుంది. జైపూర్‌ లోని భంక్రోటా ప్రాంతంలో జైపూర్‌- అజ్మీర్‌ జాతీయ రహదారికి సమీపంలో మనిహారా గార్డెన్స్‌ లో హైప్రొఫైల్‌ బర్త్‌ డే వేడుక ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పలు రకాల ఆహారపదార్థాలతో పసందైన విందు ఏర్పాటు చేశారు. వెయిటర్‌, తందూర్‌ మెషీన్‌ ను వాహనంలో పెడుతుండగా ఆ మెషీన్ కు ఉన్న ఇనుప రాడ్డుకు హైటెన్షన్‌ విద్యుత్ తీగలు తగిలాయి. దీంతో కన్నుమూసి తెరిచేంతలో దారుణం సంభవించింది. మెషీన్ తోపాటు, ఐదుగురు వెయిటర్లు కాలి బూడిదైపోయారు. విద్యుదాఘాతంతో పడిపోయిన ప్రదేశంలో వారి ఆకారాల్లో నల్లగా మాడిన మట్టితప్ప ఇకేమీ కనిపించకపోవడంతో అంతా అవాక్కయ్యారు. ఫాంహౌస్ యజమాని నిర్లక్ష్యం వల్లే దారుణం చోటుచేసుకుందన్న పోలీసులు, అతనిపై కేసు నమోదు చేశారు.

  • Loading...

More Telugu News