: దేశంలో నెంబర్ వన్ సీఎం కేసీఆర్... ఎనిమిదో స్థానంలో చంద్రబాబు


దేశంలోనే అత్యంత జనాదరణ కలిగిన ముఖ్యమంత్రుల్లో తెలంగాణ సీఎం కేసీఆర్ తొలి స్థానాన్ని ఆక్రమించారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు తొమ్మిదో ర్యాంకు దక్కింది. వీడీపీ అసోసియేట్స్ నిర్వహించిన సర్వేలో కేసీఆర్ కు 87 శాతం రేటింగ్ రాగా, చంద్రబాబుకు 58 శాతం వచ్చింది. సమాన రేటింగ్ తో చంద్రబాబు, రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధరా రాజేలు సంయుక్తంగా ఎనిమిదో స్థానంలో నిలిచారు. రెండు, మూడు స్థానాల్లో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఉన్నారు. మరోవైపు ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే టీఆర్ఎస్ కు 51 శాతం ఓట్లు వస్తాయని పీడీపీ సర్వేలో తేలింది. రాష్ట్రంలోని మొత్తం లోక్ సభ స్థానాలను టీఆర్ఎస్ కైవసం చేసుకుంటుందని వెల్లడైంది. జనాదరణలో టాప్ 12 ముఖ్యమంత్రులు వీరే... బ్రాకెట్లలో ఉన్నది రేటింగ్ శాతం... కేసీఆర్, తెలంగాణ (87) శివరాజ్ సింగ్ చౌహాన్, మధ్యప్రదేశ్ (85) మమతా బెనర్జీ, పశ్చిమ బెంగాల్ (79) జయలలిత, తమిళనాడు (75) నవీన్ పట్నాయక్, ఒడిశా (70) దేవేంద్ర ఫడ్నవిస్, మహారాష్ట్ర (62) నితీష్ కుమార్, బీహార్ (61) వసుంధర రాజే, రాజస్థాన్ (58) చంద్రబాబు నాయుడు, ఆంధ్రప్రదేశ్ (58) విజయ్ రూపాని, గుజరాత్ (52) సిద్ధరామయ్య, కర్ణాటక (49) అఖిలేష్ యాదవ్, ఉత్తరప్రదేశ్ (43)

  • Loading...

More Telugu News