: బంగాళాఖాతంలో హెలికాప్టర్లతో పటిష్ట నిఘా
మన దేశానికి ఉగ్రవాదుల నుంచి ముప్పు ఎక్కువైన నేపథ్యంలో బంగాళాఖాతంలో కూడా నిఘాను పెంచారు. భారత నావికాదళానికి చెందిన హెలికాప్టర్లతో సముద్ర సరిహద్దుల్లో నిఘాను ముమ్మరం చేశారు. నిన్నటి నుంచి రామేశ్వరం, పాంబాన ప్రాంతాల్లో హెలికాప్టర్లతో నిఘాను పెంచారు. ఇప్పటికే అత్యాధునిక పరికరాలు కలిగిన నౌకల ద్వారా నిఘా చేపట్టిన సంగతి తెలిసిందే. ఉగ్రవాదులు, సంఘవిద్రోహ శక్తులను అడ్డుకోవడానికి ఈ నిఘా ఉపయోగపడుతుందని అధికారులు తెలిపారు. ఇదే సమయంలో, చేపల వేటకు వెళ్లే మత్స్యకారులను కూడా పరిశీలించే అవకాశం ఉంటుందని చెప్పారు.