: లేటెస్ట్ ట్రెండ్ సెల్ఫీ .. హై-ఫైవ్ సెల్ఫీ!
ప్రపంచ యువతను సెల్ఫీల పిచ్చి పట్టి పీడిస్తోంది. సెల్ఫీలు దిగే క్రమంలో ఎంతో మంది తమ ప్రాణాలను సైతం కోల్పోయారు. తాజాగా ఈ సెల్ఫీలు కూడా కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ఇప్పుడు సెల్ఫీల్లో కొత్త ట్రెండ్ స్టార్ట్ అయింది. ఈ సెల్ఫీ తీసుకోవాలంటే... ముందు మీ స్మార్ట్ ఫోన్ కెమెరాను ఆన్ చేయాలి. ఆ తర్వాత సెల్ఫీ కోసం కెమెరాను క్లిక్ మనిపిస్తూనే ఫోన్ ను పైకి ఎగరవేయాలి. ఆ ఫోన్ గాల్లోంచి కింద పడేలోగానే రెండు చేతులతో చప్పట్లు కొట్టాలి. మీరు క్లాప్స్ కొట్టిన దృశ్యం ఫోన్ లో నిక్షిప్తం కావాలి. ఇదే నయా ట్రెండ్. దీనికి 'హై-ఫైవ్ సెల్ఫీ' అనే పేరు పెట్టారు. ఈ నయా ట్రెండ్ ఇప్పుడు ఆన్ లైన్ ప్రపంచాన్ని వైరస్ లా పాకేసింది. సేత్ స్నీడర్ అనే ఓ కుర్రాడు ఇలాంటి సెల్ఫీనే ఆన్ లైన్లో పెడితే... 4 లక్షల 40 వేల మంది లైక్ చేశారు. రెండు లక్షల మంది రిప్లై ఇచ్చారు.