: వచ్చేనెల 11న ప్రధాని జపాన్ పర్యటన
ప్రధాని నరేంద్ర మోదీ జపాన్ పర్యటన ఖరారైంది. నవంబర్ 11-12 తేదీల్లో జపాన్ లో ప్రధాని పర్యటించనున్నారని పీఎంవో ప్రకటించింది. ఈ పర్యటన సందర్భంగా రెండు దేశాధినేతలు పౌర అణు సహకార ఒప్పందంపై సంతకాలు చేయనున్నారు. ద్వైపాక్షిక, ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై చర్చించనున్నారు. కాగా, మోదీ గతంలో జపాన్ లో పర్యటించిన సంగతి తెలిసిందే. అనంతరం జపాన్ ప్రధాని కూడా భారత పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా రెండు దేశాల మధ్య సబంధాలు పటిష్టమయ్యాయని ప్రకటించారు. ఈ రెండు దేశాలకు సరిహద్దు దేశమైన చైనాతో సమస్యలున్న సంగతి తెలిసిందే.