: పుల్వామాలో ఇంట్లోకి చొరబడి మహిళను కాల్చి చంపిన ఉగ్రవాదులు
జమ్మూకాశ్మీర్ లోని పుల్వామా జిల్లాలో ఒక ఇంట్లోకి చొరబడ్డ అనుమానిత ఉగ్రవాదులు ఒక మహిళను కాల్చి చంపారు. ఈరోజు రాత్రి బీబా ఇంట్లోకి చొరబడిన అనుమానితులు ఆమెపై రెండుసార్లు కాల్పులు జరిపినట్లు పోలీసులు చెప్పారు. ఈ సంఘటన జరిగిన సందర్భంలో బీబా నలుగురు కూతుళ్లు, కొడుకు ఇంట్లోనే ఉన్నారు. ఈ సంఘటన అనంతరం మోటార్ సైకిల్ పై ఉగ్రవాదులు పారిపోయారు. కాగా, కాల్పులకు గురైన మహిళను ఆసుపత్రికి తరలించేటప్పటికే ఆమె చనిపోయింది. ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు.