: తిరిగి ఒకటైన సానియా, హింగిస్ జోడి... అదరగొడుతోంది!


గడచిన ఆగస్టులో విడిపోయిన టెన్నిస్ మహిళల డబుల్స్ వరల్డ్ నంబర్ వన్ జంట సానియా మీర్జా, మార్టినా హింగిస్ ల జోడీ, గత సంవత్సరం సాధించిన డబ్ల్యూటీఏ టైటిల్ ను నిలబెట్టుకోవడం కోసం ఒకటిగా కలిసి అదరగొడుతోంది. తమలో సత్తా తగ్గలేదని చాటుతూ, ఈ సీజన్ టోర్నీలో సెమీస్ కు వెళ్లింది. చైనీస్ తైపేకి చెందిన జోడీ హోచింగ్ చాన్ - యంజ్ జాన్ చాన్ లపై 7-6 (12-10) 7-5 తేడాతో సాన్ టినా జోడి గెలిచింది. తొలి సెట్ లో పోరు హోరాహోరీగా సాగగా, టైబ్రేకర్ కూడా చాలా దూరం కొనసాగింది. టైబ్రేకర్ లో 12-10 తేడాతో గెలిచిన సానియా జోడీ, రెండో సెట్ ను కాస్తంత సునాయాసంగానే గెలిచి సెమీస్ కు దూసుకెళ్లింది.

  • Loading...

More Telugu News