: చంద్రబాబు కుటుంబాన్ని చంపుతామనడం సరికాదు: సురవరం సుధాకర్ రెడ్డి


ఏఓబీలో జరిగిన ఎన్ కౌంటర్ కు ప్రతీకారం తీర్చుకుంటామని... ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబాన్ని చంపుతామని మావోయిస్టులు హెచ్చరించడం సరికాదని సీపీఐ సీనియర్ నేత సురవరం సుధాకర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. మరోపైపు, ఏఓబీలో జరిగినవి ఎదురు కాల్పులు కాదని ఆయన స్పష్టం చేశారు. మావోయిస్టులను అరెస్ట్ చేసే అవకాశం ఉన్నా... వారిని కాల్చి చంపారని ఆరోపించారు. జరిగిన ఘటనకు ప్రభుత్వం సమాధానం చెప్పాలని, ఎన్ కౌంటర్ పై న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. హిందూ మతానికి వామపక్షాలు వ్యతిరేకమని ఆరెస్సెస్ గోబెల్స్ ప్రచారం చేస్తోందని మండిపడ్డారు.

  • Loading...

More Telugu News