: సికింద్రాబాద్ లో రూ.9 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం
నార్కోటిక్ కంట్రోల్ బోర్డు (ఎన్సీబీ) అధికారులు సికింద్రాబాద్ సైనిక్ పురిలో ఈరోజు మరో రూ.9 కోట్ల విలువైన మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. ఇటీవలే డ్రగ్స్ రాకెట్ కేసులో బేగంపేట విమానాశ్రయంలో విధులు నిర్వర్తించే భారత వైమానిక దళ (ఐఏఎఫ్) వింగ్ కమాండర్ రాజశేఖర్‌రెడ్డిని అధికారులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. రాజశేఖర్ సికింద్రాబాద్‌లోని ఓ ఇల్లు అద్దెకు తీసుకొని ఉన్నాడని తెలుసుకున్న అధికారులు ఈ రోజు మధ్యాహ్నం ఆ ఇంట్లో తనిఖీలు చేశారు. ఆ ఇంట్లో ఏకంగా రూ.9 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు.