: రూ.3,777కే మరో సరికొత్త స్మార్ట్‌ఫోన్.. విడుదల చేసిన జెన్‌ మొబైల్


భారత్‌కు చెందిన స్మార్ట్‌పోన్ల త‌యారీ సంస్థ జెన్‌ మొబైల్ బ‌డ్జెట్ ధ‌ర‌లో తాజాగా మ‌రో స్మార్ట్‌ఫోన్‌ను త‌మ వినియోగ‌దారుల ముందు ఉంచింది. ‘సినీమ్యాక్స్‌ 2 ప్లస్‌’ పేరుతో తీసుకొచ్చిన ఈ స్మార్ట్‌ఫోనులో ఎస్‌ఓఎస్‌ కాలింగ్‌ సదుపాయం కూడా ఉంది. ఈ-కామర్స్‌ వెబ్‌సైట్‌ షాప్‌క్లూస్‌లో రూ.3,777 ధ‌ర‌తో ఈ స్మార్ట్‌ఫోన్‌ను అందుబాటులో ఉంచ‌నుంది. 2900 ఎంఏహెచ్‌ బ్యాటరీ సామర్థ్యం, డ్యుయ‌ల్ సిమ్ స‌దుపాయంతో, 5.5 అంగుళాల స్క్రీను, 1.3 గిగాహెడ్జ్‌ క్వాడ్‌కోర్‌ ప్రాసెసర్‌, ఆండ్రాయిడ్‌ 5.1 ఆపరేటింగ్‌ సిస్టమ్‌, 5 ఎంపీ బ్యాక్‌, 3.2 ఎంపీ ఫ్రెంట్‌ కెమెరా, 1 జీబీ ర్యామ్‌, 8 జీబీ అంతర్గత మెమొరీ ఈ స్మార్ట్‌ఫోన్‌లోని ఫీచ‌ర్లుగా ఉన్నాయి.

  • Loading...

More Telugu News