: మద్యం సేవించిన యువతి వీరంగం, రెండు దెబ్బలేసి లాక్కెళ్లిన పోలీసుల వీడియో... మీరూ చూడండి


పూటుగా మద్యం సేవించిన ఓ ఢిల్లీ యువతి వీరంగం చేసిన వీడియో వైరల్ అవుతోంది. తనను ప్రశ్నించిన పోలీసులను ఎదిరించింది. "దయచేసి ఇక్కడి నుంచి వెళ్లిపోండి" అని చెప్పిన ఓ వ్యక్తిని నువ్వెవరని ప్రశ్నించింది. తాను తాగుబోతునని, తిరుగుతానని బహిరంగంగానే చెప్పింది. ఢిల్లీలోని సివిల్ లైన్స్ లో ఈ ఘటన జరిగింది. మద్యం సేవించిన ఓ మహిళ హంగామా చేస్తోందని ఫిర్యాదు అందడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఈమెను పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లడానికి మహిళా పోలీసులు నానా పాట్లూ పడాల్సి వచ్చింది. చాలా సేపటి తరువాత ఆమెను రిక్షాలో కూర్చోబెట్టి స్టేషన్ కు తీసుకెళ్లగా, అక్కడా తన ప్రతాపం చూపింది. స్టేషన్ లోపలికికి తీసుకు వెళ్లేందుకు ప్రయత్నించగా, తాను ఏం నేరం చేశానంటూ వారిపై విరుచుకుపడింది. చెయ్యెత్తి కొట్టబోయింది. దీంతో ఆమెపై రెండు దెబ్బలేసి మరీ మహిళా పోలీసులు లోపలికి తీసుకు వెళ్లాల్సి వచ్చింది. ఆ వీడియోను మీరూ చూడవచ్చు.

  • Loading...

More Telugu News