: ప్రియాంకా చోప్రాతో ఎలెన్ ఇంటర్వ్యూపై మండిపడుతున్న అభిమానులు
ప్రముఖ అమెరికన్ టీవీ వ్యాఖ్యాత ఎలెన్ బాలీవుడ్ నటి ప్రియాంకా చోప్రాను అవమానించిందని ఆమె అభిమానులు మండిపడుతున్నారు. ప్రియాంకా చోప్రా, ఎలెన్ టాక్ షోకు హాజరైంది. ఈ షోలో ప్రియాంకా చోప్రాతో ఆమె టెకీకీలా అనే మద్యాన్ని తాగించింది. టీవీ షోలలో మద్యం తాగమని ఎవరూ చెప్పరని, కానీ ఆమె ప్రియాంకతో మద్యం తాగించిందని వారు ఆరోపిస్తున్నారు. అలాగే షోలో ప్రియాంకా చోప్రా మిస్ వరల్డ్ గా ఎంపికైనప్పుడు చేసిన అభివాదం...'కరెంట్ బల్బు తీస్తున్నట్టు ఉందని' సెటైర్ వేసింది. అలాగే టాక్ షో మధ్యలో 'మీరిప్పుడు గ్లోబల్ స్టార్ అయిపోయారు. మీ అందం, నటన ప్రేక్షకులకి నచ్చాయి' అని ఎలెన్ అనడంతో 'అలాంటిదేమీ' లేదని ప్రియాంక సమాధానం ఇచ్చిన వెంటనే 'నాకు తెలుసు, కానీ పొగడాలి కదా అని పొగిడాన'ని ఎలెన్ కాస్త ఆగ్రహంగా చెప్పింది. దీంతో ప్రియాంక అభిమానుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది.