: దిశ మార్చుకున్న 'కయాంత్' తుపాన్... నెల్లూరు సమీపంలో తీరం దాటే అవకాశం!


ఆంధ్రప్రదేశ్ లో దక్షిణ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడ్డ తుపాను బలహీనపడి వాయుగుండంగా మారిందని విశాఖ, హైదరాబాదు వాతావరణ శాఖాధికారులు తెలిపారు. తొలుత విశాఖపట్టణం తీరాన్ని ఢీ కొంటుందని, అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించిన అధికారులు, తరువాత కయాంత్ తుపాను దిశమార్చుకుందని, గంటకు 15 కిలోమీటర్ల వేగంతో మయన్మార్ దిశగా వెళ్తోందని ప్రకటించారు. దీంతో అంతా హాయిగా ఊపిరితీసుకున్న దశలో మళ్లీ ఇది దిశమార్చుకుందని, నెల్లూరు జిల్లా సమీపంలో తీరం దాటుతుందని తెలిపారు. ఈ నేపథ్యంలో ఇది ప్రస్తుతం విశాఖపట్టణానికి 260 కిలోమీటర్ల దూరంలోనూ, మచిలీపట్టణానికి 220 కిలోమీటర్ల దూరంలో ఉందని తెలిపారు. దీని ప్రభావంతో విజయనగరం జిల్లా భోగాపురం, పూసపాటిరేగ మండలాల్లో భారీ వర్షం కురిసిందని, అలాగే జిల్లాలో చెదురుమదురు వర్షాలు కురుస్తున్నాయని అధికారులు తెలిపారు. ఇది అల్పపీడనంగా మారే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. తీరప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాని సూచించారు. రాష్ట్రంలోని అన్ని పోర్టుల్లో ఒకటవ నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు.

  • Loading...

More Telugu News