: 600 కిలోమీటర్లు పారిపోయినా అరెస్టు నుంచి తప్పించుకోలేకపోయాడు


600 కిలోమీటర్ల దూరం పారిపోయినా అరెస్టు నుంచి తప్పించుకోలేకపోయిన ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... చెన్నైలోని అంబత్తూరులో ప్రింటింగ్ ప్రెస్ యజమాని ఎస్.సుకుమార్ కు అతడి స్నేహితుడు జోసెప్ ప్రైవేటు వడ్డీ వ్యాపారుల నుంచి 3 లక్షల రూపాయలు అప్పుగా తీసుకుని ఇచ్చాడు. జోసెఫ్ నుంచి తీసుకున్న మొత్తాన్ని సుకుమార్ 15 నెలలైనా తీర్చకపోవడంతో ఇద్దరి మధ్య పలుమార్లు వాగ్వాదం చోటుచేసుకుంది. ఈలోగా వడ్డీ వ్యాపారుల నుంచి జోసెఫ్‌ పై ఒత్తిడి పెరగడంతో, సోమవారం రాత్రి జోసెఫ్ మరోసారి సుకుమార్ వద్దకు వెళ్లి డబ్బులు కావాలంటూ ఒత్తిడి చేశాడు. దీంతో వ్యాపారం సరిగ్గా నడవడం లేదని, ప్రింటింగ్ మిషన్లు అమ్మేసిన తర్వాత డబ్బులు ఇచ్చేస్తానని సుకుమార్ తెలిపాడు. అనంతరం మిత్రులిద్దరూ చాలాసేపు మద్యం తాగారు. కాసేపటికి మత్తు తలకెక్కడంతో అసలు డబ్బులిచ్చేది లేదని సుకుమార్ ఎదురుతిరిగాడు. దీంతో ఇద్దరి మధ్య మరోసారి వాగ్వాదం చోటుచేసుకుంది. అది పెరగడంతో ఆగ్రహంతో జోసెప్ ఇనుప రాడ్డుతో సుకుమార్ తలపై బలంగా కొట్టాడు. దీంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం ఇంటికి చేరుకున్న జోసెఫ్ భార్య, పిల్లలను తీసుకుని తన ద్విచక్ర వాహనంపై 600 కిలోమీటర్ల దూరంలోని నాగర్‌ కోయిల్ వెళ్లి, బంధువుల ఇంటి తలదాచుకున్నాడు. సుకుమార్ మృతిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. దీంతో వలపన్నిన పోలీసులు పక్కా సమాచారంతో నాగర్ కోయిల్ చేరుకుని జోసెఫ్ ను అదుపులోకి తీసుకున్నారు.

  • Loading...

More Telugu News