: కోహ్లీ మీద ఆధారపడడం తగ్గించండి: దాదా హెచ్చరిక


టీమిండియా ఆటగాళ్లను చూస్తుంటే కోహ్లీపై ఆధారపడినట్టు కనిపిస్తోందని దిగ్గజ మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ తెలిపాడు. నాలుగో వన్డేలో ఓటమిపై గంగూలీ మాట్లాడుతూ, కోహ్లీ రాణించని కారణంగానే టీమిండియా మొహాలీ వన్డేలో ఓటమిపాలైందని అన్నాడు. టీమిండియా కోహ్లీపై అంతగా ఆధారపడినట్టు కనిపిస్తోందని గంగూలీ తెలిపాడు. ఇది జట్టుకు మంచిది కాదని అన్నాడు. మూడో స్థానంలో దిగినా కోహ్లీ మ్యాచ్ ఫినిషర్ గా ఉన్నప్పుడు, నాలుగో నంబర్ బ్యాట్స్ మన్ గా ధోనీ ఎందుకు మ్యాచ్ ఫినిషర్ కాలేడని ప్రశ్నించాడు. మ్యాచ్ ఫినిషర్ అంటే 40వ ఓవర్ తరువాత బ్యాటింగ్ కు దిగాలన్న భావనను టీమిండియా ఆటగాళ్లు విడనాడాలని ఆయన స్పష్టం చేశాడు. ధోనీ నాలుగో నంబర్ లో బ్యాటింగ్ కు రావడం జట్టుకు ఉపయోగమేనని అన్నాడు. కోహ్లీ మంచి ఆటగాడనడంలో ఎలాంటి సందేహం లేదన్న దాదా, అతనిని మాత్రమే నమ్ముకుని బ్యాటింగ్ కు దిగితే ఓటమిపాలుకాక తప్పదని హెచ్చరించాడు.

  • Loading...

More Telugu News