: 2 లక్షలు పట్టుకుని ఇంట్లోంచి వెళ్లిన చిన్నారులు.. ఇంటికి చేర్చిన అటో డ్రైవర్లు!
ప్రసారమాధ్యమాల ప్రభావమో లేక స్నేహితులు, సమాజం ప్రభావమో కానీ అనంతపురంకి చెందిన ఇద్దరు పిల్లలు చేసిన పని అందర్నీ షాక్ కి గురిచేసింది. వివరాల్లోకి వెళ్తే... ఇంట్లో తల్లిదండ్రులు ఉంచిన 2 లక్షల రూపాయలు పట్టుకుని ఇల్లు విడిచి వెళ్లిన ఇద్దరు చిన్నపిల్లలు రైల్వేస్టేషన్ చేరుకున్నారు. రైల్వేస్టేషన్ కి అయితే వచ్చారు కానీ ఎక్కడికి వెళ్లాలి? ఎలా వెళ్లాలి? అన్న దానిపై స్పష్టత లేకపోవడంతో బిత్తర చూపులు చూస్తూ నిల్చున్నారు. వారిని గమనించిన ఆటో డ్రైవర్లు వారితో మాటకలిపారు. ఎక్కడికి వెళ్తున్నారని ప్రశ్నించారు. సమాధానాలు లేక నీళ్లు నమలడంతో వారు పిల్లలిద్దర్నీ గదమాయించారు. దీంతో భయపడ్డ ఆ పిల్లలు భయంతో నిజం చెప్పారు. వారు చెప్పింది విని షాక్ తిన్న ఆ డ్రైవర్లు, వారిని నగదుతో పాటు పోలీసులకు అప్పగించి, తల్లిదండ్రులను పిలిపించారు. పిల్లల్ని ఓ కంటకనిపెట్టాలని హెచ్చరించి వారికి అప్పగించారు.