: చైనాకు మరో షాక్.. అరుణాచల్ ప్రదేశ్ సందర్శనకు దలైలామ!
ప్రముఖ బౌద్ధ గురువు, ఆధ్యాత్మికవేత్త దలైలామ అరుణాచల్ ప్రదేశ్ ను సందర్శించనున్నారు. వచ్చే ఏడాది 15 రోజుల పాటు ఆ రాష్ట్రాన్ని సందర్శించేందుకు భారత ప్రభుత్వం ఆయనకు అనుమతిచ్చింది. టిబెట్ స్వేచ్ఛ కోసం ఉద్యమించిన దలైలామా ను హతమార్చేందుకు 1959లో చైనా కుట్ర పన్నింది. దీంతో, ఆయన అక్కడి నుంచి పారిపోయి, శరణార్ధిగా భారత్ కు చేరారు. అప్పటి నుంచి భారత్ లోనే ఆయన ప్రవాస జీవితం గడుపుతున్నారు. ఈ నేపథ్యంలో దలైలామాను తమకు అప్పగించాలంటూ భారత్ ను చైనా పలుసార్లు డిమాండ్ చేసింది. టిబెట్ సరిహద్దు అయిన అరుణాచల్ ప్రదేశ్ కూడా తమ భూభాగమేనని ఎప్పటి నుంచో వాదిస్తున్న చైనా, ఆ ప్రాంతానికి తమ శత్రువు దలైలామా రావడంపై అభ్యంతరం వ్యక్తం చేసే అవకాశం వుంది. ఇటీవలే అమెరికా రాయబారి అరుణాచల్ ను సందర్శించడంపై చైనా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి విదితమే!