: 48 గంటల్లో దేశం విడిచి వెళ్లాలంటూ పాక్ దౌత్యాధికారిని ఆదేశించిన భారత్


గూఢచర్యానికి పాల్పడుతూ అరెస్టయిన పాకిస్థాన్ దౌత్య అధికారి మహమూద్ అక్తర్ ను మన దేశం విడిచి వెళ్లిపోవాలని భారత్ అధికారులు కోరారు. 48 గంటల్లోగా భారత్ ను వదిలిపెట్టాలని ఆదేశించారు. కాగా, ఢిల్లీ జూలో నిన్న రాజస్థాన్ కు చెందిన మౌలానా రంజాన్, సుభాష్ జంగిర్ అనే ఇద్దరు వ్యక్తులను మహమూద్ కలిసారు. బీఎస్ఎఫ్ జవాన్లకు సంబంధించిన కీలక సమాచారాన్ని తెలియజేశారనే ఆరోపణల నేపథ్యంలో అక్తర్ ను అరెస్ట్ చేశారు. అయితే, అక్తర్ కు ఉన్న దౌత్యాధికారాల వల్ల ఆయన్ని విడిచిపెట్టాల్సి వస్తోంది. ఈ కారణంగానే ఆయన్ని దేశం విడిచి వెళ్లాల్సిందిగా ఆదేశించారు. బీఎస్ఎఫ్ జవాన్లకు సంబంధించిన సమాచారం అందజేసిన ఆ ఇద్దరిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.

  • Loading...

More Telugu News