: షుగర్ జబ్బుతో బాధపడుతున్నా భోజన ప్రియత్వం చంపుకోలేకపోతున్న కిమ్ జోంగ్ ఉన్!


క్షిపణి ప్రయోగాలు, అణుబాంబులు, హైడ్రోజన్ బాంబులు అంటూ భయపెట్టే ఉత్తరకొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ మంచి భోజన ప్రియుడని ఆయన చెఫ్ కెంజి పుజిమొటో తెలిపారు. ప్యాంగ్ యాంగ్ లో ఆయన మాట్లాడుతూ, కిమ్ జోంగ్ ఉన్ మంచి భోజన ప్రియుడన్నారు. షుగర్ వ్యాధితో బాధపడుతున్నప్పటికీ ఆయన తన భోజనప్రియత్వాన్ని వదులుకోలేకపోతున్నారని తెలిపారు. దీంతోనే గత జూన్ లో 132 కేజీల బరువున్న కిమ్ జోంగ్ ఉన్ ఇప్పుడు మరింత బరువు పెరిగారని ఆయన చెప్పారు. స్విట్జర్లాండ్‌ జున్ను, బార్డియాక్స్‌ రోజ్‌ వైన్‌ లేకుండా ఆయనకు ముద్ద దిగదని ఆయన తెలిపారు. ఒక్క రాత్రి పూటే ఆయన అనేక కప్పుల స్విస్‌ జున్నుతోపాటు పది బాటిళ్ల బార్డియాక్స్‌ వైన్‌ (ఒక్కో బాటిళ్ల 750ఎంఎల్‌) తాగడం తనకు తెలుసునని ఆయన చెప్పారు. స్విట్జర్లాండ్‌ లోని బోర్డింగ్‌ స్కూల్లో చదువుకుంటున్న రోజుల నుంచి ఉన్ కు అక్కడి జున్ను (చీజ్‌) బాగా ఇష్టమని ఆయన చెప్పారు. దీంతో ఉత్తరకొరియాలో జున్ను నచ్చక 2014లో కొందరు వంటవాళ్లను ఓ ఫ్రెంచ్‌ కుకరీకి పంపించి మరీ స్విస్‌ జున్ను ఎలా తయారుచేయాలో శిక్షణ ఇప్పించారని ఆయన వెల్లడించారు. 2012లో ఉన్‌ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మరింత భోజన ప్రియుడిగా మారిపోయారని, చుట్టూ అందమైన అమ్మాయిలను పెట్టుకొని భోజనం చేయడం ఆయనకు అలవాటని ఉన్‌ కుటుంబంతో 1982 నుంచి చెఫ్‌ గా అనుబంధం ఉన్న కెంజీ వెల్లడించారు.

  • Loading...

More Telugu News