: బ్రిటన్‌లో కులాల అంతరాలకు పాతర


మనదేశంలో ఎన్ని చట్టాలు ఉన్నప్పటికీ, ఎంత దారుణంగా అమలవుతున్నప్పటికీ.. కుల వివక్ష ఇంకా రాజ్యమేలుతూనే ఉంది. అయితే రాజ్యాంగం విషయంలో రూపకల్పన సమయంలో మనకు స్ఫూర్తిగా నిలిచిన బ్రిటన్‌లో కులవివక్ష నిషేధ బిల్లుకు ఇన్నాళ్లకు రాజముద్ర లభించింది. బ్రిటన్‌ రాణి ఓకే చెప్పేయడంతో త్వరలో ఈ మేరకు ఓ చట్టం వస్తుంది. బ్రిటన్‌ మంత్రి జోస్విన్‌పోన్‌ ఈ విషయం వెల్లడించారు. దీంతో దక్షిణాసియా దేశాలు కాకుండా కులవివక్షపై చట్టం తెచ్చిన మొదటి దేశం యూకే అవుతోంది.

ఇది తమ అపూర్వ విజయం అని బ్రిటన్‌లోని నాలుగు లక్షల మంది దళితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కులవివక్ష అనుభవిస్తున్న వారికి ప్రభుత్వం దన్నుగా నిలిచిందంటూ కితాబిస్తున్నారు. ఈ చట్టం వల్ల బ్రిటన్‌లోని ఆసియన్లకు ఊరట లభిస్తుంది.

  • Loading...

More Telugu News